ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, చైర్మన్
గాంధీనగర్ : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గాంధీనగర్లో భక్తిపారవశ్యం వెల్లివిరిసింది.నవరాత్రుల 8వ రోజును పురస్కరించుకుని అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గాంధీనగర్లో కౌన్సిలర్ చేగూర్ లక్ష్మి ప్రసన్న వేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీ చండీ హోమం, ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక వేడుకకు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. విచ్చేసిన వారిలో స్థానిక ఎమ్మెల్యే శంకర్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వం, మాజీ చైర్మన్ విశ్వం, మాజీ ఎంపీపీ రవీందర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, కౌన్సిలర్ దంపతులు ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గాంధీనగర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాలనీవాసులు, మాతృమూర్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హోమ గుండం వద్ద అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అమ్మవారి కృపాకటాక్షాల కోసం ప్రార్థించారు.

కౌన్సిలర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
పూజా కార్యక్రమాలు, పూర్ణాహుతి అనంతరం కౌన్సిలర్ చేగూర్ లక్ష్మి ప్రసన్న వేణుగోపాల్ దంపతులు విచ్చేసిన భక్తులందరికీ ఘనంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులందరూ స్వామి, అమ్మవార్ల ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ వేడుకల్లో చేగూరి శ్రీనివాస్, మలగారి సత్యనారాయణ, కోన దేవయ్య, మిర్యానం ప్రదీప్, రెడ్డి రమేష్, అభిలాష్, శ్రీశైలం (లడ్డు), ప్యాట ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, అంతటి కోటిలింగం గౌడ్, రఘునాథ్ యాదవ్, శ్రీకాంత్, చరణ్, నిఖిల్, సాయి, సిటీ కేబుల్ ముత్యాలు, మాలచలం భిక్షపతి, మురళి, రామేశ్వర్ రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ గోపాల్ అరవింద్, సందీప్ లతో పాటు స్థానిక నాయకులు, మహిళలు, భక్తులు, కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.






