🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 16 Oct 2026 | ⏰ 07:53 PM

మెదక్ అక్టోబర్ 16 : పిల్లల ఆరోగ్యం, పోషణ, సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలను నిరంతరం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో 9వ జాతీయ పోషణ మాసం – 2026 ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గణేశ్వర్, అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి, మెదక్ రామయంపేట్ సిడిపిఓల తో కలిసి కలెక్టర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు వయస్సు అవసరాలకు అనుగుణంగా సమతుల ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

9వ జాతీయ పోషణ మాసం –లో భాగంగా నెల రోజుల పాటు పోషణ ప్రాముఖ్యత, పోషణ్ ట్రాకింగ్, జన ఆందోళన్, సమతుల ఆహారం , పోషకాహారం వంటి అంశాలపై గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు, కిషోర బాలికలు , పిల్లలకు అవగాహన కల్పించారని తెలిపారు.. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలకు అందించాల్సిన వివిధ రకాల పోషకాహారం గురించి వివరించారు.

ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార సేవలు, వివిధ రకాల పోషకాహార పదార్థాల వినియోగం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాధాన్యత పై తల్లిదండ్రులకు అవగాహన కల్గి ఉండాలన్నారు. ముఖ్యంగా 3–5 సంవత్సరాల పిల్లల్లో శారీరక, మానసిక, భాషా, మేధో , సృజనాత్మక అభివృద్ధికి అనుగుణంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి వివరించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా 9వ జాతీయ పోషకాహార మాసంలో ఉత్తమ సేవలందించిన అధికారులను, అంగన్వాడి సిబ్బందిని కలెక్టర్ మెమొంటోలతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ అంగన్వాడి పిల్లలు ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్స్‌ను సందర్శించి, వారు తయారు చేసిన ఆహారాన్ని రుచి చూసి అభినందించాను. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు, వైద్య శాఖ అధికారులు,అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్