🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర మహాసభలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 21 Sep 2026 | ⏰ 06:59 PM

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి సెప్టెంబర్21( ప్రజా నేస్తం ) : ఆందోల్ నియోజకవర్గం జోగిపేట, సెప్టెంబర్ దళిత జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం దళిత జర్నలిస్ట్ ఫోరం (డీజేఏ ఫ్ ) ఆధ్వర్యంలో అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని జోగిపేట సీఐ అనిల్ కుమార్ తలారి యాదగిరి సమక్షంలో ఆవిష్కరించారు. సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ పాటంచెరువు ఎక్స్ రోడ్ వద్ద జరిగే మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా దళిత జర్నలిస్టులు, జిల్లా కమిటీలు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివక్ష, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటం అవసరమని నిర్వాహకులు తెలిపారు. దళిత జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్, అక్రిడిటేషన్ సౌకర్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత, ఇళ్ల స్థలాలు, విద్యా మరియు వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జోగ్యల్ల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మాదిగ బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్