🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కూనూరులో ఎస్సీ మోర్చా జిల్లా నేత సారయ్య సతీమణిని పరామర్శించిన బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 కూనూరు | 🗓 15 Oct 2026 | ⏰ 08:25 PM

జనగామ ప్రతినిధి : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పరిధిలోని జాఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా జనగామ జిల్లా అధికార ప్రతినిధి ఇల్లందుల సారయ్య సతీమణి ఇల్లందుల కోమల గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పరామర్శించారు.

ఈ సందర్భంగా కోమల గారి ఆరోగ్య పరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అందుతున్న వైద్య చికిత్స వివరాలను కుటుంబ సభ్యులతో చర్చించి, ఆమె త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా సంకోచించకుండా సంప్రదించాలని వారికి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ చేతివృత్తుల సెల్ జిల్లా కన్వీనర్ పోతోజు ఎల్లచారి, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తీగారపు బుచ్చయ్య, స్థానిక బూత్ అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, సకినాల కొమురెల్లి, బెల్లి పెద్దన్నలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్