రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన శ్రీమతి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గురువారం లాంఛనంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు, వివిధ నియోజకవర్గాల నేతల నుంచి ఘన స్వాగతం, శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంలో, కార్యకర్తలకు అండగా నిలవడంలో పారిజాత నర్సింహారెడ్డి నాయకత్వం ఎంతో కీలకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొడిగే స్వామి గౌడ్, లెక్చరర్స్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు కళ్ళెం నరసింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్ర మహేందర్, డీసీసీ కార్యదర్శి నగేష్, సీనియర్ నాయకులు ఇరిగి రమేశ్, పోచబోయిన వినోద్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరమల రామచంద్రారెడ్డి, నాయకులు పృథ్వీ రాజ్, మున్నా జానీ, ఆంజనేయులు, చుక్క వెంకటేష్, ఎర్ర రవీందర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








