చిలుకూరు : సూర్యాపేట జిల్లా చిల్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC Chilkur)లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో ముడిపడిన మన సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక అని వైద్యాధికారి డా. నిమ్మల సుభాష్ పేర్కొన్నారు.
సంప్రదాయ పండుగలను జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొని పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.






