🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

గణపవరంలో ఎమ్మెల్సీ ఓటు నమోదుపై యూత్ కాంగ్రెస్ అవగాహన సదస్సు

Nookapangu manikanta
Nookapangu manikanta 📍 గణపవరం | 🗓 15 Oct 2026 | ⏰ 05:18 PM

మునగాల (కొదాడ) : ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి (MLC) ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఓటు నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మునగాల మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమం చేపట్టారు.

స్థానిక గ్రామ సర్పంచ్ అమరబోయిన మట్టయ్య గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్సీ ఓటు నమోదు విధానం, అర్హతలు, అవసరమైన ధ్రువీకరణ పత్రాల వివరాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లోని అర్హులైన పట్టభద్రులందరినీ గుర్తించి, చివరి తేదీ లోపు ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను బూత్ లెవల్ ఏజెంట్లు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మునగాల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తక్కెలపాటి సాయి, కోదాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్రా నవీన్ రెడ్డి, మండల నాయకులు జిల్లెపల్లి శ్రీనివాస్, గోపిరెడ్డి అశోక్ రెడ్డి, కేతిరెడ్డి మట్టారెడ్డితో పాటు గ్రామ వార్డు సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు (BLA), యూత్ కాంగ్రెస్ శ్రేణులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Nookapangu manikanta
రచయిత గురించి (Author Bio)

Nookapangu manikanta

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్