నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ నీరు నారాయణఖేడ్ నుండి మన్సూర్ మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ఉండి కూడా నీరు రాకపోవడం గమనార్హం. మున్సిపాలిటీ, కల్హేర్, నిజాంపేట, శంకరంపేట్, కంగ్టి, మనూర్ మండలాల్లో అధికారులు మిషన్ భగీరథ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే నీరు విడుదల చేయాలనీ మిషన్ భగీరథ పనులు అంతరాయంలో ఏదైనా సమస్యలు ఉంటే అధికారులు వెంటనే మరమ్మత్తులు చేసి నీరును వదలాలని కోరుతున్నారు.
నారాయణఖేడ్ నియోజకవర్గంలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీటికి అంతరాయం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




