🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

షాద్‌నగర్ 20వ వార్డులో జెట్ మిషన్‌తో డ్రైనేజీ పూడికతీత పనులు.. కౌన్సిలర్ గోపాల్ చొరవతో సమస్యకు పరిష్కారం

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 షాద్‌నగర్‌ | 🗓 13 Oct 2026 | ⏰ 04:58 PM

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : షాద్‌నగర్‌ పట్టణంలోని 20వ వార్డులో డ్రైనేజీ జామ్‌ కావడంతో కౌన్సిలర్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో శుభ్రత పనులు చేపట్టారు. మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో జెట్‌ మిషన్‌ ద్వారా డ్రైనేజీని శుభ్రం చేయించారు. మురుగు నీరు సక్రమంగా ప్రవహించక స్థానికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. డ్రైనేజీలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి మురుగు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూశారు.

వార్డులో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కౌన్సిలర్‌ గోపాల్‌ తెలిపారు. ప్రజలు డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయకుండా సహకరించాలని సూచించారు. మున్సిపల్‌ సిబ్బంది సమన్వయంతో వార్డులో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొన్నారు.

వార్డులో ఎక్కడా పారిశుద్ధ్య లోపం లేకుండా, ప్రజలకు దోమలు, దుర్వాసన సమస్యలు రాకుండా నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్, ఘన వ్యర్థాలు వేయడం వల్లనే లైన్లు జామ్ అవుతున్నాయని పేర్కొంటూ, కాలనీవాసులు డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి వార్డును పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్