నారాయణఖేడ్ : సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లి గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆదివారం మాసాన్‌పల్లి గ్రామంలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే
శ్రీనివాస్‌ను ఆప్యాయంగా పలకరించిన భూపాల్ రెడ్డి, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి, వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుంటూ, ఎలాంటి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పారు. శ్రీనివాస్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ దిలీప్ కుమార్, మాసాన్‌పల్లి సర్పంచ్ సాయిలు, గ్రామ ప్రముఖులు పోచయ్య, సంగయ్యలతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






