🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బీఆర్‌ఎస్ కార్యకర్త సాయిలు మృతికి పద్మా దేవేందర్ రెడ్డి నివాళి.. కుటుంబానికి ఆర్థిక సాయం

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 08 Oct 2026 | ⏰ 06:06 PM

మెదక్ అక్టోబర్ 08 : మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త సాయిలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి గురువారం పేరూరు గ్రామానికి చేరుకుని, సాయిలు పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం సాయిలు అంత్యక్రియల్లో స్వయంగా పాల్గొన్న ఆమె, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాయిలు మృతి తీవ్ర బాధాకరమని పేర్కొంటూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాము అన్ని వేళలా అండగా ఉంటామని మనోధైర్యం కల్పించడంతో పాటు బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు అంజాగౌడ్, మాజీ ఎంపీపీ కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ యాదగిరి, నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీధర్ రెడ్డి, షాకీర్, యాదగౌడ్, ఏగొండ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్