కొమురవెల్లి: ఐనాపూర్ మాజీ సర్పంచ్ పబోజు విజేందర్ కుమారుడు పబోజు మురళి కార్తీక్ ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కుషాయిగూడ, బండ్లగూడలోని వారి నివాసానికి చేరుకున్న నాయకులు మురళి కార్తీక్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీరని శోకంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
నివాళులర్పించిన వారిలో సీపీఎం మండల కార్యదర్శి తాడూరి రవీందర్, నాయకులు తేలు ఇస్తారి, కానుగుల రాజు, ఏనుగుల శీను, నవీన్, ఎల్లయ్య, రవీందర్ తదితరులు ఉన్నారు.







