రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపాలిటీ 15వ వార్డు శ్రీనివాస్ కాలనీలో ప్రాంతంలో కొన్ని వీధికుక్కలు గుంపులు గుంపులుగా చేరి సైకిల్ పై వెళ్తున్న విద్యార్థి పవన్ పై ఒక్కసారిగా దాడి చేయడంతో చెవిపై,మోకాలిపై కరవడంతో విద్యార్థి పవన్ అక్కడికక్కడే కిందపడటం జరిగింది. ఈ దాడిలో చెవిపై,శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు విద్యార్థి పవన్ ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రోడ్డుపై పడేసి తీవ్రంగా గాయపరిచాయి.
విద్యార్థి పవన్ కేకలు విన్న స్థానికులు కర్రలతో పరుగెత్తుకొచ్చి కుక్కలను తరిమికొట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అప్పటికే తీవ్ర రక్తస్రావంతో అల్లాడుతున్న పవన్ కుటుంబ సభ్యులు ప్రథమ చిక్సీత చేశారు.చెవి పై కుట్లు పడ్డాయి. ఈ ఘటనతో పవన్ కుటుంబంతో పాటు కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కుక్కలన్నింటినీ పట్టుకుని షెల్టర్లకు తరలించాలని విజ్ఞప్తి చేసింది. తన బిడ్డలా ఇంకెవరూ బాధపడకూడదని పేర్కొంటూన్నారు. వెంటనే కుక్కలన్నింటినీ వీధుల్లో నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.






