🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

వివిధ గణేష్ మండపాల్లో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రావు… కోమటూర్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 08:14 PM

మెదక్ సెప్టెంబర్ 25: మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులతో ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ప్రజలకు శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని వినాయకుడిని ప్రార్థించారు.అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రావు కోమటూర్ చెరువు వద్దకు చేరుకుని వినాయక నిమజ్జన కార్యక్రమాల కోసం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, నిర్వాహకులు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.నిమజ్జన ప్రాంతంలో భక్తుల రాకపోకలు, జనసందోహం నియంత్రణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, నిమజ్జన ప్రాంతం వద్ద అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు.

వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగేలా అధికారులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నిమజ్జన ప్రాంతంలో పరిశుభ్రతను కాపాడాలని పేర్కొన్నారు.ప్రజలు, భక్తులు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని ఎమ్మెల్యే రోహిత్ రావు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నాయకులు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వివిధ గణేష్ మండపాల్లో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్ రావు... కోమటూర్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్