తుర్కపల్లి మండలం దత్తాయపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు .ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడి గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో వివరాలను అడిగి తెలుసుకున్నారు. మార్నింగ్ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అనే అంశంపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, మౌలిక వసతుల పరిస్థితి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలను పరిశీలించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణము లబ్ధిదారుల పరిస్థితి ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకొని సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రజా ప్రతినిధులు కేవలం కార్యాలయాలకు పరిమితం కాకుండా గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటూ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ దత్తాయ పల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ క్షేత్రస్థాయిలో పర్యటన కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ధనావత్ శంకర్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చాడ భాస్కర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్, తాసిల్దార్ రవికుమార్, ఎంపీడీవో లెంకల గీతారెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏవో శ్రీ ఉమా, ఎంఈఓ మంజుషా రాణి, విద్యుత్ శాఖ ఏఈ బిక్షపతి, హౌసింగ్ ఏఈ నరేష్, కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు తుమ్మల మమత తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ జిట్ట బాలకృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు దేవరుప్పల ఐలయ్య, ఎరుకల వెంకటేష్ గౌడ్, దేవరుప్పుల మల్లేష్, గొప్ప లింగారెడ్డి ,నల్లరాజు, గుంటి రాజు, దానబోయిన నవీన్ ,వార్డు సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు







