🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

కాకా వెంకటస్వామికి ఘన నివాళులు

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి | 🗓 06 Oct 2026 | ⏰ 09:12 AM

మంచిర్యాల, అక్టోబర్ 5: మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి సేవలను స్మరించుకుంటూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. 1998లో బొగ్గు గని కార్మికుల పదవీ విరమణ అనంతరం మూడో బెనిఫిట్‌గా కోల్ మైన్స్ పెన్షన్ ఒప్పందం సాధించడంలో కాకా వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. 2015 డిసెంబర్ 22న కాకా వెంకటస్వామి మరణించిన అనంతరం కోల్ మైన్స్ పెన్షన్ పెంపు కోసం ఆశించిన స్థాయిలో కృషి జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

1998లో కుదిరిన ఒప్పందం ప్రకారం మార్కెట్‌లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి మూడు సంవత్సరాల కు ఒకసారి కోల్ మైన్స్ పెన్షన్‌ను పెంచాల్సి ఉన్నప్పటికీ, పెన్షన్ పెంపు జరగకపోవడంతో లక్షలాది మంది బొగ్గు పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంకటయ్య తెలిపారు. కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ఆయన కుమారుడు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ సింగరేణి, కోల్ ఇండియా పరిధిలోని సుమారు 5.80 లక్షల మంది బొగ్గు విశ్రాంత ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. కరువు భత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంపు, కనీస పెన్షన్‌ను రూ.15,000కు పెంచడం, హెల్త్ కార్డుపై రూ.25 లక్షల వరకు వైద్య సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్యతో పాటు పలువురు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్