మెదక్ ప్రతినిధి: రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా మంగళవారం (అక్టోబర్ 6, 2026) మెదక్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు గవర్నర్ అధికారిక పర్యటన వివరాల షెడ్యూల్ ఖరారైంది.
మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటకు హైదరాబాద్‌లోని లోక్ భవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి, మధ్యాహ్నం 2:30 గంటలకు మెదక్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)కి చేరుకుంటారు.
Also read

అపరిశుభ్రంగా హైవే మరుగుదొడ్లు
పర్యటన షెడ్యూల్ వివరాలు:
- మధ్యాహ్నం 2:40 గంటలకు: మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నిర్వహించే ‘నశా ముక్త్ భారత్’ ర్యాలీని ఐడీఓసీ ప్రాంగణంలో గవర్నర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
- మధ్యాహ్నం 2:50 గంటలకు: ఐడీఓసీలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించి, స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో సమావేశమవుతారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అవుతారు.
- మధ్యాహ్నం 3:00 గంటలకు: ఐడీఓసీ నుంచి రామాయంపేటకు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.
- మధ్యాహ్నం 3:30 గంటలకు: రామాయంపేట పట్టణంలోని అమోఘ్ హోటల్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్దకు చేరుకుంటారు.
- మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 వరకు: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో, జాతీయ రహదారి (NH-765DG) వెంబడి సుమారు 35 వేల జీడిమామిడి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు.
- సాయంత్రం 4:30 గంటలకు: రామాయంపేట నుంచి తిరుగు ప్రయాణమై సాయంత్రం 6:40 గంటలకు హైదరాబాద్ లోక్ భవన్‌కు చేరుకుంటారు.
గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.







