ఆందోల్-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ పొట్లూరి శివశేఖర్ సోమవారం (అక్టోబర్ 5న) తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఆయనకు ముందుగానే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
13వ వార్డులో నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, వార్డు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడిగా పొట్లూరి శివశేఖర్ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని స్థానికులు కొనియాడారు. డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో 13వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని, మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని శివశేఖర్ స్పష్టం చేశారు. ప్రజాసేవలో ఆయన మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని సహచర నాయకులు, అభిమానులు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.




