నారాయణఖేడ్, ప్రజానేస్తం ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కరవు ప్రాంతంగా ప్రకటించి రైతులను
ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు నారాయణ ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. సకాలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. విద్యుత్ సరఫరా సమస్యలతో వ్యవసాయ మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
నారాయణఖేడ్ ను కరవు ప్రాంతంగా ప్రకటించాలి: మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




