🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

అధికారులు మారినా.. సూచిక బోర్డుపై మారని పేర్లు!

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 పుల్కల్ | 🗓 03 Oct 2026 | ⏰ 04:11 PM

ఆందోల్ ప్రతినిధి (ప్రజా నేస్తం): మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో అధికారులు మారుతున్నా, సూచిక బోర్డుపై మాత్రం పేర్లు మారడం లేదు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నెలకొన్న ఈ నిర్లక్ష్య వైఖరిపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించే అధికారుల పేర్లు, హోదాలు, వారి సంప్రదింపు వివరాలను ఎప్పటికప్పుడు ప్రజల సమాచారం కోసం సూచిక బోర్డులపై నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే, పుల్కల్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు బదిలీపై వెళ్లిపోయినా, కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించినా సూచిక బోర్డులపై పాత అధికారుల పేర్లే దర్శనమిస్తున్నాయి.

వివిధ పనుల నిమిత్తం మండల పరిధిలోని గ్రామాల నుంచి కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలు, రైతులు ఏ పని కోసం ఏ అధికారిని కలవాలో తెలియక తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అధికారుల వివరాలను అప్‌డేట్ చేయడంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన నూతన సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అధికారులు మారినా.. సూచిక బోర్డుపై మారని పేర్లు!

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్