ఆందోల్ : భారత స్వాతంత్ర్య పోరాటానికి దిశానిర్దేశం చేసిన మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని, జోగిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ ఆశయాలు, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), పట్టణ అధ్యక్షుడు డాకూరు వెంకటేశం, స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జోగిపేట కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



