.రంగారెడ్డి : మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్దామని యువ మహిళా సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి పిలుపు నిచ్చారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని,రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోమాల్ పల్లి గ్రామంలో సర్పంచ్ బుర్రి స్వప్న భూపాల్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో ముందుగా గ్రామ పంచాయతి భవనం,అనంతరం మహాత్మా గాంధీ విగ్రహాలకు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా సర్పంచ్,ఉప సర్పంచ్ లు మాట్లాడుతూ,,గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వం కలిగిన, సామాజిక న్యాయంతో కూడిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.గాంధీజీ ఆలోచనలు, ఆదర్శాలు నేటి సమాజానికి మాత్రమే కాకుండా భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్ భూపాల్ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆశా మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.







