🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఎల్లుపేటలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 22 Sep 2026 | ⏰ 07:52 PM

టేక్మాల్ ప్రతినిధి, సెప్టెంబర్ 22 (ప్రజానేస్తం): మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. స్థానిక భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో హాజరై, వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష పూజలు చేశారు. అనంతరం విఘ్నేశ్వరుడిని దర్శించుకుని, గ్రామంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, శాంతి శ్రేయస్సులు కలగాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. భక్తుల పూజలు, భజనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

🎁 ఆకర్షణీయమైన లక్కీ డ్రా బహుమతులు

ఉత్సవాల సందర్భంగా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ మహబూబ్ మాట్లాడుతూ.. నవరాత్రి వేడుకల్లో భాగంగా భక్తుల కోసం ప్రత్యేక లక్కీ డ్రా పోటీని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు:

  • మొదటి బహుమతి: 5 కిలోల ప్రసాదం లడ్డూ
  • రెండవ బహుమతి: ఎలక్ట్రిక్ స్కూటీ

ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి ఒక్కో టోకెన్‌కు రూ.400 రుసుముగా నిర్ణయించామని, భక్తులు టోకెన్లు పొంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ ప్రతినిధులు సాయిరాం, మల్లేష్, నరేష్ గౌడ్, మల్లేశం, ప్రశాంత్ గౌడ్, హనుమంతు, విష్ణు, గురుమూర్తి, కుమార్, రాజు, దుర్గేష్, శ్రీకాంత్, అరవింద్, సంగమేష్, బీరప్ప తదితరులతో పాటు గ్రామ మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్