సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సాయిబాన్‌పేటకు చెందిన కుమారి సాయిప్రియ గౌడ్ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలలో ప్రతిభ కనబరిచింది. జ్యోతి – కృష్ణ గౌడ్ దంపతుల కుమార్తె అయిన సాయిప్రియ సిద్దిపేటలో నీట్ పరీక్ష రాయగా, విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 590వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాయిప్రియ గౌడ్‌తో పాటు ఆమె తల్లిదండ్రులను గ్రామ పంచాయతీ, ఉపాధ్యాయుల తరపున శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
నీట్ ర్యాంకు సాధించిన సాయిప్రియకు సన్మానం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:



