♉ వృషభం – వార ఫలాలు
ఈ వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించాల్సి రావచ్చు. క్రమంగా ఊహించని విధంగా వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా బయట సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. మిత్రుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూరప్రయాణాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.


