మెదక్ (ప్రజానేస్తం ప్రతినిధి, సెప్టెంబర్ 27): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్ర వెంకటేశం ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం మాట్లాడుతూ… ప్రకృతి ఒడిలో వెలసిన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి దర్శన భాగ్యం కలగడం ఎంతో సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను ఇచ్చిందన్నారు. భక్తుల కొంగుబంగారమై, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఏడుపాయల అమ్మవారు భక్తుల అపార విశ్వాసాన్ని చూరగొంటున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:




