టేక్మాల్ : మెదక్ జిల్లా టేక్మాల్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీధరచారి మాతృమూర్తి ఇటీవల మృతి చెందగా, విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు ఆదివారం వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వారం రోజుల క్రితం శ్రీధర్ చారి మాతృమూర్తి మరణించిన విషయం తెలియడంతో, తెలంగాణ రక్షణ సేన పార్టీ అందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మాసన్నగారి బాలయ్య టేక్మాల్ గ్రామానికి విచ్చేశారు. శ్రీధరచారిని, వారి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. మాతృవియోగం తీరని లోటని పేర్కొంటూ ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఆయన వెంట తెలంగాణ రక్షణ సేన పార్టీ టేక్మాల్ మండల ఇన్‌చార్జి బొబ్బిలి సుధాకర్ ఉన్నారు.








