🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బతుకమ్మ పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి

NARESH SAMARLA
NARESH SAMARLA 📍 బెల్లంపల్లి (మంచిర్యాల | 🗓 08 Oct 2026 | ⏰ 02:28 PM

తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ అధికారులను కోరారు. ప్రతి గ్రామంలో విద్యుత్ దీపాల వ్యవస్థను పరిశీలించి, పనిచేయని వీధి దీపాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేసి విద్యుత్ స్తంభాలకు అమర్చాలని కోరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాత్రి వేళల్లో గ్రామ ప్రజలకు మెరుగైన వెలుతురు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలందరూ బతుకమ్మ పండుగను సంతోషంగా, ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కొండు బానేష్ విజ్ఞప్తి చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
NARESH SAMARLA
రచయిత గురించి (Author Bio)

NARESH SAMARLA

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్