🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సేవా సంకల్ప్ అభియాన్‌లో విద్యార్థులకు పోటీలు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 24 Sep 2026 | ⏰ 06:39 PM

టేక్మాల్: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా జనగామ మల్లారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి సూచన మేరకు టేక్మాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శ్యామయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాస రచన పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. చిత్రలేఖనంలో విద్యార్థులు వివిధ సామాజిక అంశాలను ప్రతిబింబించేలా చిత్రాలను రూపొందించగా, వ్యాస రచనలో తమ ఆలోచనలను అక్షరరూపంలో వ్యక్తీకరించారు.

పోటీల అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. విజేతలకు బహుమతులు అందజేస్తూ నాయికోటి శ్యామయ్య అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సామాజిక బాధ్యత, పోటీతత్వ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు..

ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయులు లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శామయ్య, ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దిరాములు, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు వడ్డె రాములు,గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు మోహన్, బీజేవైఎం జిల్లా సెక్రెటరీ మదన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్