టేక్మాల్ : మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కోరంపల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీప్రసన్న వినీత్, ఉపసర్పంచ్ నాగరాజు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీప్రసన్న వినీత్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగరాజు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







