వచ్చే వారంలో సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు
సంగారెడ్డి : దళిత జర్నలిస్టుల ఫోరం (DJF) 11వ రాష్ట్ర మహాసభలను వచ్చే వారానికి వాయిదా వేస్తున్నట్లు ఫోరం రాష్ట్ర నాయకులు ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7న సంగారెడ్డిలో నిర్వహించాల్సిన మహాసభలకు ముఖ్య అతిథులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరుకావాల్సి ఉంది. అయితే అదే తేదీన వారికి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో మహాసభలకు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మంత్రుల సూచన మేరకు రాష్ట్ర, జిల్లా కమిటీల ముఖ్య నాయకులు సమావేశమై మహాసభలను వచ్చే వారానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
మహాసభలు సంగారెడ్డిలోనే వచ్చే వారంలో ఘనంగా నిర్వహిస్తామని, ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. మహాసభల సవరించిన తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. తేదీ మార్పును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న DJF ప్రతినిధులు, సభ్యులు గమనించి, నాయకత్వానికి సహకరించాలని వారు కోరారు. మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు DJF రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర అధ్యక్షులు తలారి యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఏ. డేవిడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు రాపాక విజయరాజు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామని అశోక్ సంయుక్తంగా ప్రకటనలో తెలిపారు.





