🗓 శుక్రవారం 23 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మెదక్ జిల్లాలో రికార్డు విద్యుత్ డిమాండ్ రికార్డు డిమాండ్‌కు దీటుగా విద్యుత్ సరఫరా జిల్లా ఎస్‌ఈ నారాయణ నాయక్

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 10 Oct 2026 | ⏰ 07:38 PM

మెదక్, అక్టోబర్ 10: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతుండగా, మెదక్ జిల్లాలోనూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ నారాయణ నాయక్ తెలిపారు. విద్యుత్ అంతరాయాలపై వస్తున్న కథనాలపై స్పందిస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

గత ఏడాది అక్టోబర్‌లో జిల్లాలో 282 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 567 మెగావాట్లకు చేరిందని తెలిపారు. గత వేసవిలో మార్చి నెలలో 506 మెగావాట్లకు పైగా డిమాండ్ నమోదైందని పేర్కొన్నారు. వ్యవసాయం, గృహ అవసరాల నుంచి విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ ముందస్తు ప్రణాళికతో సరఫరా వ్యవస్థను బలోపేతం చేసి రికార్డు డిమాండ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని చెప్పారు.

సబ్‌స్టేషన్ల వద్ద వోల్టేజీని మెరుగుపరిచేందుకు హైదరాబాద్ నుంచి 17, 2 ఎంవీఏఆర్ కెపాసిటర్ బ్యాంకులను యుద్ధప్రాతిపదికన తరలించి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రామాయంపేట, దొంగల్‌ధర్మారం, కుచాన్‌పల్లి సబ్‌స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచి ఓవర్‌లోడ్ సమస్యను అధిగమించామని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

జిల్లావ్యాప్తంగా గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని నారాయణ నాయక్ తెలిపారు. పొట్ట దశలో ఉన్న వరి పంటతోపాటు ఇతర పంటలు ఎండిపోకుండా అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్