🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

టీబీ ముక్త్ అభియాన్‌లో ఆందోల్ మండల గ్రామపంచాయతీలకు గుర్తింపు

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 ఆందోల్ | 🗓 08 Oct 2026 | ⏰ 09:19 PM

ఆందోల్ ప్రతినిధి : టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మెరుగైన పనితీరు కనబరిచిన గ్రామపంచాయతీలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలు, ధ్రువీకరణ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆందోల్ మండలం చింతకుంట గ్రామపంచాయతీకి సిల్వర్ మెడల్, పోతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీకి బ్రాంజ్ మెడల్ లభించాయి.

ఈ సందర్భంగా చింతకుంట గ్రామ సర్పంచ్ నాగరాజు, పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మిలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ పాండు నాయక్ చేతుల మీదుగా గుర్తింపు పత్రాలు అందుకున్నారు.

టీబీ ముక్త్ అభియాన్‌లో ఆందోల్ మండల గ్రామపంచాయతీలకు గుర్తింపు

ఈ కార్యక్రమంలో అధికారులు జానకి రెడ్డి, రాజేష్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. టీబీ నిర్మూలన కార్యక్రమంలో గ్రామస్థాయిలో చింతకుంట, పోతిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలు చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించడం పట్ల స్థానిక ప్రజలు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్