🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బాధలో ఉన్న కుటుంబాలకు భరోసా… మృతుల కుటుంబాలను పరామర్శించిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 05 Oct 2026 | ⏰ 04:15 PM

మెదక్: ఆప్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబాలకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం మెదక్ జిల్లా హవేలిఘనపూర్‌ మండల పరిధిలోని పలు గ్రామాల్లో మరణించిన వారి పార్థివదేహాలను ఆయన సందర్శించి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మండలంలోని బూరుపల్లి మాజీ సర్పంచ్ చెన్న గౌడ్ తండ్రి కిష్ట గౌడ్, సుల్తాన్‌పూర్ తండాకు చెందిన అరిగి శ్రావణి, అలాగే స్కూల్ తండాకు చెందిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు రంజిత్ నాయక్ తండ్రి కేతావత్ రూప్‌సింగ్ నాయక్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆయా గ్రామాలకు వెళ్లి మృతుల భౌతికకాయాలపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ పరంగా అన్ని విధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కసిరెడ్డి మాణిక్యారెడ్డి, సర్పంచులు సాయిలు, రమేష్, శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ సాయిబాబా, నాయకులు విట్ఠల్, రామచంద్రారెడ్డి, కుర్మ పోచయ్య, రవి, నరేందర్‌రెడ్డి, గంగేల్లి నర్సింలు, ప్రతాపరెడ్డి, మూగ లక్ష్మయ్య, కిరణ్ గౌడ్, చంద్రమోహన్ గౌడ్, జగదీష్, నాగరాజు, స్వామి నాయక్, జైపాల్‌రెడ్డి, వడ్ల నాగరాజు, రమేష్, సూర్య నాయక్, గోపాల్ నాయక్, లక్ష్మీపతి, శ్రీహరి, సాప సాయిలు, అరిగే పోచయ్య, రాజేశ్వర్‌‌రావు, సతీష్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్