🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మెదక్ ఖ్యాతిని ప్రపంచస్థాయికి చాటాలి : గంజి శ్రీనివాస్

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 30 Sep 2026 | ⏰ 06:52 PM

మెదక్: క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను బుధవారం ప్రముఖ సంఘ సేవకులు, వ్యాపారవేత్త గంజి శ్రీనివాస్ గుప్తా కళాశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థులు క్రీడా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి మెదక్ ఖ్యాతిని రాష్ట్ర, జాతీయ స్థాయితో పాటు ప్రపంచస్థాయికి చాటాలని ఆకాంక్షించారు.విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ దాగి ఉందని, సరైన ప్రోత్సాహం లభిస్తే వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలరని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి క్రీడలకు దూరం కాకూడదని పేర్కొన్నారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు అవసరమైన మేరకు ఆర్థిక సహాయం, ఇతర సహాయ సహకారాలు
అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి సాధన చేసి మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.మెదక్ జిల్లాలో క్రీడా ప్రతిభకు కొదవ లేదని, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వస్తున్నారని గంజి శ్రీనివాస్ అన్నారు.

వారికి సరైన ప్రోత్సాహం, శిక్షణ, అవసరమైన సహకారం లభిస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటే అవకాశం ఉందన్నారు.మెదక్ విద్యార్థులు పతకాలు సాధించడం గర్వకారణమని ఈ విజయాలు ఇక్కడితో ఆగకూడదన్నారు.రాష్ట్రం, దేశం దాటి ప్రపంచస్థాయిలో మెదక్ పేరు మార్మోగేలా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు.ఐదు బంగారు పతకాలు, రెండు వెండి పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి కళాశాల కీర్తిని రాష్ట్రస్థాయిలో ఇనుమడింపజేశారన్నారు.

విజేత లను కళాశాల ఆవరణలో కళాశాల ఇన్‌చార్జి ఫిజికల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధ్యాపకులు ఘనంగా సన్మానించారు.విద్యార్థులు ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటూ పతకాలు సాధించడం అభినందనీయమని అధ్యాపకులు పేర్కొంటున్నారు.విద్యార్థుల విజయాలకు అధ్యాపకులు, క్రీడా విభాగం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతోదోహదపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్ గౌడ్, గేమ్స్ కమిటీ సభ్యులు డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ హరిత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని పతక విజేతలను అభినందించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్