🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

మాచవరంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

జనార్ధన్
జనార్ధన్ 📍 మెదక్ | 🗓 11 Oct 2026 | ⏰ 07:52 PM

మెదక్‌, అక్టోబర్‌ 11: మెదక్‌ మండలం మాచవరం గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారిని బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) రూపంలో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ముందుగా రామాలయం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన షెడ్‌లో ప్రతిష్ఠించారు. అనంతరం కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తొమ్మిది రోజులపాటు జరగనున్న ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 40 మంది భవాని మాలలు ధరించడం విశేషంగా నిలిచింది. గ్రామ సర్పంచ్‌ సాంబశివరావు, భవానీ స్వాములు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. పూజల అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
జనార్ధన్
రచయిత గురించి (Author Bio)

జనార్ధన్

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్