🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

తెలంగాణ నిజమైన జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 27 Sep 2026 | ⏰ 06:28 PM

ఆదిలాబాద్: తెలంగాణ సమాజానికి నిజమైన జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మార్పీఎస్ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని, బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ… ఉమ్మడి ఆదిలాబాద్ నేలపై కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించడం ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో గర్వకారణమని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల నుంచి అంచలంచెలుగా ఎదిగిన బాపూజీ, నిజాం రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం తొలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవినే తృణప్రాయంగా త్యాగం చేసిన నిబద్ధత గల త్యాగశీలి అని గుర్తుచేశారు. మలిదశ ఉద్యమ ప్రారంభంలో హైదరాబాద్‌లోని తన నివాసమైన ‘జలదృశ్యం’ను ఉద్యమ కార్యాలయానికి కేటాయించి వెన్నుదన్నుగా నిలిచారని తెలిపారు.

97 ఏళ్ల వృద్ధాప్యంలోనూ ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేపట్టి, చివరి శ్వాస వరకు పోరాడిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బహుజన నాయకుడైన కొండా లక్ష్మణ్ బాపూజీనే తొలి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆనాడు బలంగా ఆకాంక్షించారని, ఆయన చూపిన పోరాట బాటలో నడవడమే బాపూజీకి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్