రంగారెడ్డి : జీవితం అంటే పోరాటమె కానీ, అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియని, ఉహించని సంఘటనలు జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి.. అది అనుభవించే వారికే తెలుస్తుందని మన పెద్దలు ఊరకనే అనలేదు… ఒంటరిగా ఉన్నా కష్టమే, ఎవరికి భారంగా కాకూడదని కూడా చాలామంది వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు… అలాంటి ఉదాహరణే ఇక్కడ ప్రస్తావించుకుందాం… కన్న కొడుకులకు భారం కాకూడదని ఒక తండ్రి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు నియోజకవర్గంలో హట్ టాఫిక్ గా మారింది.
రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.మల్లేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెళ్లి గ్రామానికి చెందిన కమ్మరి పాండయ్య (59) గత 25 ఏళ్లుగా నందిగామ గ్రామంలో వడ్రంగి పని చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య చనిపోవడం,దానికి తోడుగా తనకు తీవ్రమైన కాలు నొప్పి ఉండటంతో పాండయ్య మానసిక వేదనకు గురయ్యాడు.
తన వల్ల కొడుకులు ఇబ్బంది పడకూడదనే బాధతో సోమవారం 12-10-2026 తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో నందిగామ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడటం జరిగింది. స్టేషన్ మాస్టర్ వెంకట్రావు ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ డి. మల్లేశ్వర్ కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఏమై పోతున్నాయి బంధాలు, కుటుంబాలు? కారణం ఎవరికి వాళ్ళు హృదయంతో ఆలోచించుకోవాల్సిన అత్యవసరం ఏర్పడిందని విశ్లేషకులు సూచిస్తున్నారు.








