🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సంగెం గ్రామంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

SURAMONI BALAIAH
SURAMONI BALAIAH 📍 కేశంపేట | 🗓 15 Oct 2026 | ⏰ 07:05 PM

రంగారెడ్డి జిల్లా : షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం సంగెం గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి పండాల్‌ భక్తులతో సందడిగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పూజలు, ప్రత్యేక కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, కేశంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సబ్‌ఇన్‌స్పెక్టర్ పరమేశ్వర్ దుర్గాదేవి పండాల్‌ను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంగెం గ్రామంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు

గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.అనంతరం జవాజీ శాంతమ్మ, నాగభూషణం గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
SURAMONI BALAIAH
రచయిత గురించి (Author Bio)

SURAMONI BALAIAH

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్