🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా మెదక్‌లో కాంగ్రెస్ నిరసన.. దిష్టిబొమ్మ దహనం!

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 09:59 PM
  • ఎస్‌ఐఆర్ పేరుతో లక్షలాది ఓట్ల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం
  • సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు డిమాండ్

మెదక్, సెప్టెంబర్ 25 (ప్రజానేస్తం):

ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల పేర్లను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి కోట్ల సంఖ్యలో పేర్లను తొలగించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతైనట్లు నివేదికలు చెబుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారమ్‌-6లో అదనపు నిబంధనలు, డిక్లరేషన్లు చేర్చి సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ అయిన ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాయకూడదని హితవు పలికారు. ఓటర్ల హక్కులను కాలరాస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో మెదక్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్, మండల అధ్యక్షులు నాగరాజు, కిరణ్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్