మెదక్, సెప్టెంబర్ 28 : అధికారుల సమిష్టి కృషితోనే మెదక్ టూరిజం అవార్డు కైవసం చేసుకోవడం జరిగిందని కలెక్టర్ ప్రతిమసింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి అనంతరం రెండు రోజుల క్రితం హైదరాబాదులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతుల మీదుగా మెదక్ టూరిజం అవార్డు అందుకున్న కలెక్టర్ ప్రతిమా సింగ్ కు జిల్లా అధికారులు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించి మెమొంటో బహకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారుల సమిష్టి కృషితోనే నేను ఈ అవార్డు పొందగలిగానని భవిష్యత్తులో టూరిజం అభివృద్ధిలో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం ఇంటర్మీడియట్ విద్యార్థులు టూరిజంపై నిర్వహించిన వ్యాచరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి మెమొంటోలు బహుకరించారు. మెదక్ జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రథమ స్థానంలో ఉంచడానికి జిల్లా పాలన యంత్రాంగం తరపున విశేష కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ కార్యక్రమం కలెక్టర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ ఓ అంబదాస్ రాజేశ్వర్, టూరిజం అభివృద్ధి అధికారి జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ జోజి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.






