🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బోత్ X రోడ్డు వద్ద సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Abhinay
Abhinay 📍 బోథ్ | 🗓 18 Oct 2026 | ⏰ 01:22 PM

బోథ్ : బోత్ X రోడ్డు వద్ద సులభ కాంప్లెక్స్ నిర్మాణానికి గౌరవ బోత్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ గారు భూమిపూజ నిర్వహించారు. చుట్టుపక్కల మండలాల నుంచి బోత్ X రోడ్డుకు వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ప్రజల అవసరాలను గుర్తించి, వారికి అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ సులభ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దీనివల్ల బోత్ X రోడ్డు మీదుగా ప్రయాణించే ప్రజలకు, చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే వారికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇప్పటికే బోత్ X రోడ్డు వద్ద లైట్లు లేకపోవడం చీకట్లు అలుముకుంటున్నాయని, రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. దీనికి పరిష్కారంగా రెండు రోజుల్లో హైమాస్ట్ లైట్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు పనులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత పనులను ముందుకు తీసుకెళ్తున్నారు.

ప్రజా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ బోత్ X రోడ్డు వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు కావాల్సిన మౌళిక సదుపాయాలకు కల్పించడానికి తాను ఎల్లవేళ్లల పనిచేస్తానన్నారు.

ఈ కార్యక్రమం బోత్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్,సర్పంచుల సంఘం అధ్యక్షులు స్వామి, శ్రీధర్ రెడ్డి, గులాబ్, రూప్చంద్, సుజిల్, రాంచందర్, అధికారులు, ప్రజాప్రతనిధులు, నాయకులు, స్థానికులు, తదితరులు ఉన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
Abhinay
రచయిత గురించి (Author Bio)

Abhinay

ప్రజానేస్తం తెలుగు డిజిటల్ మీడియా ప్రత్యేక ప్రతినిధి. తెలుగు రాష్ట్రాల్లోని తాజా, ప్రామాణిక మరియు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్