🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

చిన్నారి సువిక్ష నందనకు ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 టేక్మాాల్ | 🗓 08 Oct 2026 | ⏰ 03:16 PM

టేక్మాల్: చిన్నారి లింగంపల్లి సువిక్ష నందన అత్యంత పిన్న వయసులోనే అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కేవలం 2 నెలల 13 రోజుల వయసులోనే సహాయంతో నిటారుగా ఉన్న స్థితిలో తలను పైకి ఎత్తడం, ఇరువైపులా సులువుగా తిప్పడం వంటి ప్రత్యేక శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు గాను ప్రతిష్టాత్మక ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సంస్థ సువిక్ష నందన ప్రతిభను అధికారికంగా గుర్తించింది. చిన్నారి ప్రదర్శించిన అద్భుతమైన తల నియంత్రణ, మెడ బలం, సమతుల్యత, సమన్వయం వంటి అంశాలను నిశితంగా పరిశీలించిన అనంతరం రికార్డు నిర్వాహకులు ఈ ఘనతను ధృవీకరించారు. ఈ సందర్భంగా సువిక్ష నందనకు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్, రికార్డ్ హోల్డర్ గుర్తింపు పత్రం, మెడల్ మరియు ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు.

సువిక్ష నందన తల్లిదండ్రులైన లింగంపల్లి రజిత, జనార్ధన్‌లు ఇద్దరూ తెలంగాణ వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారులుగా (AEOలు) విధులు నిర్వహిస్తున్నారు. తల్లి రజిత టేక్మాల్ మండలం ఎలకుర్తి క్లస్టర్ అధికారిగా, తండ్రి జనార్ధన్ నార్సింగి మండలం జప్తిశివనూరు క్లస్టర్ అధికారిగా పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం పాపన్నపేట మండలం చీకోడ్ అయినప్పటికీ, ఉద్యోగ రీత్యా ప్రస్తుతం మండల కేంద్రమైన టేక్మాల్‌లో నివాసముంటున్నారు. విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటూనే, పాప శారీరక ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఈ ఘనత సాధించేలా ప్రోత్సహించారు.

చిన్నారి సువిక్ష నందనకు ‘బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్

“ప్రతిరోజూ మా పాపకు కేవలం ఒక్క నిమిషం పాటు బోర్లా పడుకునేలా చిన్న వ్యాయామం చేయించేవాళ్లం. ఇలా నిత్యం ప్రాక్టీస్ చేయించడం వల్ల మా పాప ఇంత గొప్ప రికార్డు సాధిస్తుందని అసలు ఊహించలేదు. సువిక్ష నందన ప్రపంచ రికార్డు సాధించడం చూస్తుంటే ఒక తల్లిగా నా ఆనందానికి అవధులు లేవు. ఇది మా కుటుంబానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. తల్లిదండ్రులంతా తమ పిల్లలు మేల్కొని ఉన్న సమయంలో పెద్దల పర్యవేక్షణలో తగిన విధంగా కొద్దిసేపు టమ్మీ టైమ్ చేయించాలి. చిన్న చిన్న ప్రయత్నాలే పిల్లల ఎదుగుదలలో గొప్ప మలుపులు అవుతాయి” అని తల్లి రజిత పేర్కొన్నారు.

సువిక్ష నందన సాధించిన విజయం పట్ల తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇంత చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పిన సువిక్ష నందనను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో చిన్నారి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్