🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణపతి శోభాయాత్ర

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 25 Sep 2026 | ⏰ 09:42 PM

అందోల్, సెప్టెంబర్ 25: సంగారెడ్డి జిల్లా ఆందోల్ గూడెం డబుల్ బెడ్‌రూం కాలనీలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి శోభాయాత్ర, నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కాలనీలోని చిన్నారులు, మహిళలు సంప్రదాయ వేషధారణలతో చేసిన కోలాట నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామివారి శోభాయాత్ర కోలాహలంగా కొనసాగింది.

లడ్డూ వేలంపాటలో భక్తుల పోటీ:

శోభాయాత్రకు ముందు నిర్వహించిన లడ్డూ ప్రసాదం వేలంపాటలో భక్తులు తీవ్రంగా పోటీపడ్డారు. మొత్తం మూడు లడ్డూలను వేలం వేయగా:

  • మొదటి లడ్డూను: నవీన్ – రత్న దంపతులు దక్కించుకున్నారు.
  • రెండవ లడ్డూను: శ్రీను – శ్యామల దంపతులు కైవసం చేసుకున్నారు.
  • మూడవ లడ్డూను: రాధిక గారు సొంతం చేసుకున్నారు.

లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్న భక్తులను బాల గణేష్ యూత్ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గణపతిని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.

ఈ వేడుకల్లో బాల గణేష్ యూత్ ప్రతినిధులు పొన్నం సమర క్రాంతి, రాము, శ్రీను, గణేష్, నగేష్, మోసిన్, వాజీద్, అశోక్, యాదగిరితో పాటు కాలనీవాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్