మెదక్, అక్టోబర్ 2 : బాలానగర్ గ్రామపంచాయతీలో బీబీజీ రాంజీ, గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సర్పంచ్ బెండే వీణ సంతోష్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీబీజీఆర్ఎం-జీ పనులకు సంబంధించి గ్రామ సోషల్ మ్యాప్‌ను రూపొందించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, స్వచ్ఛ భారత్, తాగునీటి సరఫరా, ప్రజా సంక్షేమం, రాబోయే అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామంలోని వివిధ సమస్యల పరిష్కారానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సర్పంచ్ వీణ సంతోష్ తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లింగం, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.








