తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి డాక్టర్ సర్వోత్తం రెడ్డిని తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. విద్యావంతులు, ఉద్యోగ, ప్రజా సమస్యలపై పోరాడే అనుభవం ఉన్నవారికి టికెట్లు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విజయం సాధించేలా ప్రచార వ్యూహాలకు రంగం సిద్ధం చేసుకొంటోంది.
రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





