పీఆర్టీయూ టేక్మాల్ మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల శాఖ సర్వ సభ్య సమావేశం అనంతరం ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ ప్రక్రియను పాపన్నపేట మండల శాఖ అధ్యక్షుడు పంతులు రాజు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షులుగా అమీరోద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సహదేవ్, అసోసియేట్ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి, ప్రియాంక, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, అశోక్, శ్వేత, రవళి, కార్యదర్శులుగా నరేష్, శివ, నాగరాణి, అర్షియా ఫాతిమా ఎన్నికయ్యారు.
పీఆర్టీయూ టేక్మాల్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





