స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మెదక్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవినే తృణప్రాయంగా త్యజించిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని నాయకులు కొనియాడారు.
పోరాట స్ఫూర్తికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ: మెదక్లో జయంతి వేడుకలు

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





