టేక్మాల్: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతకర్త పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను టేక్మాల్‌లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ సేవకు, ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ లేబర్ సెల్ కన్వీనర్ నాయికోటి శ్యామయ్య, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధిరాములు, బీజేవైఎం సెక్రటరీ మదన్ రెడ్డి, సెక్రటరీ శేఖర్, తదితరులు ఉన్నారు.
టేక్మాల్ లో పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:





