🗓 గురువారం 22 అక్టోబర్ 2026 ⏰ సమయం: --:--:-- --
[ప్రకటనల స్థలం - 728x90 Header Ad]
About Us | Contact Us | Privacy Policy | Disclaimer
🔴 బ్రేకింగ్ న్యూస్ :

ఆపదలో అండగా.. బాధిత కుటుంబాలకు భరోసాగా

ప్రజానేస్తం డెస్క్
ప్రజానేస్తం డెస్క్ 📍 తాజా వార్త | 🗓 29 Sep 2026 | ⏰ 06:00 PM

మెదక్ సెప్టెంబర్ 29: పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్‌, బీఆర్‌ఎస్‌ నాయకురాలు ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి మంగళవారం పర్యటించి ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యంగా ఉండాలని సూచించారు. గాంధారిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు పాశం అంజిరెడ్డి తండ్రి పాశం నాగిరెడ్డి మృతిచెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జయపురంలో దాసరి కేశయ్య, యూసుఫ్‌పేటలో చామంతుల నారాయణ కుటుంబాలను పరామర్శించారు.

కుర్తివాడలో ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ మోహనరావు అత్తమ్మ మృతి చెందడంతో వారి కుటుంబాన్ని, అలాగే బీఆర్‌ఎస్‌ కార్యకర్త పుట్టి మల్లేశం కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. కష్టకాలంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జగన్‌, సర్పంచ్‌ సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వడ్ల కుబేరుడు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ఈ వార్తను మీ మిత్రులకు షేర్ చేయండి:
WhatsApp
ప్రజానేస్తం డెస్క్
రచయిత గురించి (Author Bio)

ప్రజానేస్తం డెస్క్

తెలంగాణ, జాతీయ రాజకీయాలతోపాటు, పర్యాటక రంగం, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అంశాలపై ఆర్టికల్స్ రాయడంలో మంచి అనుభవం ఉన్నది.

🏠హోమ్ 💬వాట్సాప్ ✍️రిపోర్టర్